Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నాని నాయికగా మరోసారి సమంత 
  • ప్రకాశ్ కోవెలమూడి బాలీవుడ్ చిత్రం 
  • ప్రభుదేవా 'మెర్క్యురి' రిలీజ్ డేట్ 
  • టైటిల్ నిర్ణయించిన రచయిత గోపీమోహన్
*  అందాల సమంత మరోసారి నాని సరసన నటించనుంది. నాగార్జున, నాని హీరోలుగా ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. ఇందులో నాని సరసన నాయికగా సమంతను అడుగుతున్నట్టు సమాచారం.  
*  గతంలో 'అనగనగా ఓ ధీరుడు', 'సైజ్ జీరో' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రకాశ్ కోవెలమూడి బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావ్ జంటగా రూపొందే చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తాడు. ప్రకాశ్ కోవెలమూడి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తనయుడన్న సంగతి విదితమే.
*  ప్రభుదేవా హీరోగా 'పిజ్జా' ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'మెర్క్యురి' పేరిట ఓ సైలెంట్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  వెంకీ, దూకుడు వంటి పలు హిట్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ రచయిత గోపీమోహన్ దర్శకుడిగా మారుతున్నాడు. ఈ చిత్రానికి 'ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా' అనే టైటిల్ని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.    
samantha
Nagarjuna
prabhudeva

More Telugu News